Movie Wingz
  • Home
  • TELUGU
  • అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న డ్రామా-థ్రిల్లర్ మరియు అమెజాన్ ఒరిజినల్ సిరీస్ – ది ఫ్యామిలీ మ్యాన్‌ను విడుదల చేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో
TELUGU

అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న డ్రామా-థ్రిల్లర్ మరియు అమెజాన్ ఒరిజినల్ సిరీస్ – ది ఫ్యామిలీ మ్యాన్‌ను విడుదల చేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో

అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న డ్రామా-థ్రిల్లర్ మరియు అమెజాన్ ఒరిజినల్ సిరీస్ – ది ఫ్యామిలీ మ్యాన్‌ను విడుదల చేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో
~ డైనమిక్ ద్వయం రాజ్ & DK (రాజ్ నిదిమోరు & కృష్ణ DK) రూపొందించిన ది ఫ్యామిలీ మ్యాన్ ఈ సెప్టెంబర్ 20న ప్రత్యేకంగా అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా 200 దేశాలు మరియు భూభాగాల్లో విడుదల కానుంది ~
~ ఫ్యామిలీ మ్యాన్ ద్వారా పద్మశ్రీ అవార్డు గ్రహీత మరియు జాతీయ అవార్డు అందుకున్న మనోజ్ బాజ్‌పాయ్‌తో పాటు జాతీయ అవార్డు గ్రహీత ప్రియమణి, షరిబ్ హాస్మి, నీరజ్ మాధవ్, శరద్ కేల్కర్, గుల్ పనాగ్, సందీప్ కిషన్, దర్శన్ కుమార్, సన్నీ హిందుజా, మరియు శ్రేయా ధన్వంతరీ లాంటి భారతదేశ వ్యాప్తంగా ఉన్న అవార్డు గ్రహీతలైన ఇతర నటీనటులు వీక్షకుల ముందుకు రానున్నారు. ~
~ టెలివిజన్ క్రిటిక్స్ అసోసియేషన్* (TCA) ముందు ప్రదర్శితం కానున్న మొట్టమొదటి ఇండియన్ అమెజాన్ ఒరిజినల్‌గా ఈ ఫ్యామిలీ మ్యాన్ నిలవనుంది.~
~ తాజా మరియు ప్రత్యేక సినిమాలు, టీవీ షోలు, స్టాండ్-అప్ కామెడీ, ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ లాంటి వాటిని అపరిమితంగా స్ట్రీమ్ చేసే సౌలభ్యం, ప్రైమ్ మ్యూజిక్ ద్వారా యాడ్ ఫ్రీ మ్యూజిక్, భారతదేశపు అతిపెద్ద ఉత్పత్తుల ఎంపికలను ఉచిత వేగవంతంగా డెలివరీ పొందే సౌకర్యం, టాప్ డీల్స్ ను ముందే యాక్సెస్ చేసే సౌలభ్యం, ప్రైమ్ రీడింగ్ ద్వారా అపరిమితంగా చదివే అవకాశం లాంటివి అన్నింటినీ నెలకు కేవలం ₹129 కే ప్రైమ్ అందిస్తోంది ~
ముంబయ్ – సెప్టెంబర్ xx, 2019 – అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అమెజాన్ ఒరిజినల్ సిరీస్ – ది ఫ్యామిలీ మ్యాన్‌ ట్రైలర్ విడుదల గురించి అమెజాన్ ప్రైమ్ వీడియో ఈరోజు ప్రకటించింది. ఒక మధ్య తరగతి వ్యక్తిగానే కాకుండా ఒక ప్రపంచ-స్థాయి గూఢచారిగా పనిచేసే శ్రీకాంత్ తివారీ అనే వ్యక్తి జీవితంలోకి వీక్షకులను ఈ ట్రైలర్ తీసుకువెళ్తుంది. డ్రామా థ్రిల్లర్‌గా రూపొందిన ది ఫ్యామిలీ మ్యాన్ కథ మొత్తం శ్రీకాంత్ తివారీ చుట్టూ తిరుగుతుంది. ఓవైపు కుటుంబ బాధ్యతలను నెరవేరుస్తూనే మరోవైపు నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో అత్యంత రహస్య ప్రత్యేక సెల్ అధికారిగా దేశం మరియు పౌరుల మీద పెద్ద స్థాయిలో జరిగే తీవ్రవాద దాడులను నిరోధిస్తుంటాడు. రాజ్ & DK (రాజ్ నిదిమోరు & కృష్ణ DK) ద్వారా రూపొందిన ది ఫ్యామిలీ మ్యాన్ అనే ఈ డిజిటల్ చిత్రం సెప్టెంబర్ 20న హిందీ, ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, జర్మన్, జపనీస్, ఫ్రెంచ్, ఇటాలియన్, బ్రెజిలియన్, పోర్చుగీస్, మరియు స్పానీష్ భాషల్లో ప్రత్యేకించి అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా 200 దేశాలు మరియు భూభాగాల్లోని వీక్షకుల ముందుకు రానుంది.

అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా డైరెక్టర్ విజయ్ సుబ్రమణియమ్ మాట్లాడుతూ, “ది ఫ్యామిలీ మ్యాన్‌తో విలక్షణమైన మరియు అత్యంత నాణ్యమైన కథను అమెజాన్ తన వీక్షకులకు అందించనుంది. తద్వారా కెమెరా ముందు మరియు కెమెరా వెనుక ఉన్న నైపుణ్యవంతులైన వ్యక్తులను వీక్షకులకు వారి ఇంట్లోనే పరిచయం చేయాలనే నిబద్ధతను మరోసారి చాటుకుంటోంది. ది ఫ్యామిలీ మ్యాన్ అనేది ఒక వేగంగా సాగిపోయే డ్రామా-థ్రిల్లర్. రాజ్ & DK జంటతో పాటు మనోజ్ బాజ్‌పేయ్, ప్రియమణి, నీరజ్ మాధవ్, గుల్ పనాగ్ లాంటి అత్యంత ప్రతిభావంతులైన ఇతర నటీనటుల నైపుణ్యాన్ని మరోసారి వీక్షకుల ముందుకు తీసుకురానుంది. డ్రామా, యాక్షన్, థ్రిల్ మరియు ఆశ్చర్యకరమైన హాస్యంతో నిండిన ఈ షో 10 ఎపిసోడ్లుగా వీక్షకుల ముందుకు రానుంది. భౌగోళిక రాజకీయాల నేపథ్యంలో సాగే ది ఫ్యామిలీ మ్యాన్ షో అనే ఈ డ్రామా-థ్రిల్లర్ ఒక వ్యక్తి దేశానికి సేవ చేయడం కోసం ఎలాంటి సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాడో కళ్లకు కడుతుంది. అలాగే, ఒక సాధారణ కుటుంబ పెద్ద ఇటు ఇంటినీ, అటు పని జీవితాన్ని ఎలా సమతౌల్యం చేశాడనే విషయం కూడా వీక్షకులకు ఆసక్తి కలిగిస్తుంది” అన్నారు.
D2R అనే తమ ప్రొడక్షన్ కంపెనీ ద్వారా ది ఫ్యామిలీ మ్యాన్‌ అనే ఈ అమెజాన్ ఒరిజినల్‌కు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న రాజ్ & DK మాట్లాడుతూ, “సుదీర్ఘమైన కథతో ముందుకు వచ్చే ఆలోచనలో భాగంగా సరైన వేదిక కోసం మేము ఇన్నాళ్లూ ఎదురు చూస్తూ వచ్చాం. ఈ నేపథ్యంలో, అమెజాన్ ప్రైమ్‌ రూపంలో మాకు అద్భుతమైన భాగస్వామి దొరికింది. నిజంగానే ఇది మాకొక అద్భుతమైన ప్రయాణం. మా మొదటి షోతోనే మేము సరికొత్త మరియు ఉద్విగ్నభరిత ఇన్నింగ్స్ చవిచూశాం. ది ఫ్యామిలీ మ్యాన్‌తో మేము ఒక సరికొత్త కళా ప్రక్రియతో ముందుకు రావడమే కాకుండా సవాళ్లతో పాటు సంతృప్తిని కూడా చవిచూశాం. భౌగోళిక రాజకీయాలను ఒక యాక్షన్ థ్రిల్లర్‌తో కలిపి చూపడంతో పాటు ఇలాంటి కళా ప్రక్రియల్లో సాధ్యం కాని హాస్యాన్ని సైతం విజయవంతంగా ఇందులో భాగం చేశాం. ప్రస్తుత కాలపు సంఘటనలే స్ఫూర్తిగా రూపొందించిన ఈ సిరీస్‌లో ఒక మధ్య తరగతి వ్యక్తి తన వృత్తి జీవితంలో భాగంగా తీవ్రవాదం మీద కూడా విజయవంతంగా పోరాడడం ఆకట్టుకుంటుంది. ది ఫ్యామిలీ మ్యాన్ అనేది ఒక సాధారణ వ్యక్తికి సంబంధించిన అతని ఆశలు, ఆకాంక్షలు మరియు సమస్యలను కళ్లకు కడుతుంది. ఈ షోలో ఆ సాధారణ వ్యక్తి తన కుటుంబ బాధ్యతలు మోస్తూనే దేశాన్ని రక్షించడానికి కూడా ప్రయత్నించడం అద్భుతంగా ఉంటుంది” అని అన్నారు.

ఈ ప్రయోగాత్మక డ్రామా థ్రిల్లర్ సిరీస్‌ను రూపొందించడంతో పాటు నిర్మాణం మరియు దర్శకత్వం కూడా రాజ్ & DK (స్ట్రీ, గో గోవా గోన్, షోర్ ఇన్ ది సిటీ) చేపట్టారు. అలాగే, రెండు-సార్లు జాతీయ అవార్డ్ గెల్చుకున్న మనోజ్ బాజ్‌పేయ్‌ మరియు జాతీయ అవార్డ్ గ్రహీత ప్రియమణిని ఈ సిరీస్ ద్వారా చిన్న తెరకు తీసుకొచ్చారు. అలాగే, ఈ అమెజాన్ ఒరిజినల్ సిరీస్‌లో షరీబ్ హస్మీ, నీరజ్ మాధవ్, శరద్ కేల్కర్, గుల్ పనాగ్, సందీప్ కిషన్, దర్శన్ కుమార్, సన్నీ హిందూజ, శ్రేయ ధన్వంతరీ మరియు ఇతరులు కూడా నటించారు.
సంక్షిప్తంగా: అమెజాన్ ఒరిజినల్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్‌ ట్రైలర్ మనకు జాతీయ దర్యాప్తు సంస్థలోని స్పెషల్ సెల్‌లో పనిచేసే ఒక మధ్య-తరగతి వ్యక్తి (శ్రీకాంత్ తివారీ) జీవితాన్ని పరిచయం చేస్తుంది. విధి నిర్వహణలో భాగంగా అతను దేశాన్ని తీవ్రవాద దాడుల నుంచి రక్షించే ప్రయత్నం చేస్తూనే రహస్య జీవితం, తీవ్రమైన ఒత్తిడి మరియు చాలీచాలని జీతంతో కుటుంబాన్ని పోషించడానికి అనేక కష్టాలు పడుతుంటాడు.
ట్రైలర్‌ను ఇక్కడ వీక్షించండి:
https://youtu.be/XatRGut65VI
అమెజాన్ ప్రైమ్ వీడియోలో తాజా మరియు ప్రత్యేకమైన సినిమాలు మరియు టీవీ షోలు మరియు హీవావెన్, మీర్జాపూర్, ఇన్‌సైడ్ ఎడ్జ్ లాంటి అమెజాన్ ఒరిజినల్ సిరీస్‌లతో పాటు స్టాండ్-అప్ కామెడీ, భారీ భారతీయ మరియు హాలీవుడ్ సినిమాలు, US TV సిరీస్‌లు, అత్యంత ప్రఖ్యాతి చెందిన భారతీయ మరియు పిల్లల షోలు, మరియు అవార్డులు గెల్చుకున్న అమెజాన్ ఒరిజినల్స్ లాంటి భారీ సెలక్షన్లు యాడ్-ఫ్రీగా, ప్రపంచ స్థాయి వినియోగదారు అనుభవంతో అందుబాటులో ఉన్నాయి. హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, పంజాబీ, మరియు బెంగాలీ టైటిళ్లతో ఈ సర్వీస్ అందుబాటులో ఉంది.
త్వరలో రానున్న అమెజాన్ ఒరిజినల్ ది ఫ్యామిలీ మ్యాన్ మరియు హాలీవుడ్ & బాలీవుడ్‌లోని సరికొత్త రిలీజ్ సినిమాలు, తాజా US టీవీ షోలు, పిల్లలకు ఇష్టమైన కార్టూన్లు మరియు ఇతర అమెజాన్ ఒరిజినల్స్ చూడడానికి దయచేసి www.PrimeVideo.com చూడండి లేదా అమెజాన్ ప్రైమ్ వీడియో యాప్‌ని ఈరోజే డౌన్‌లోడ్ చేసుకోండి. సంవత్సరానికి కేవలం ₹999 లేదా నెలకు ₹129తో ప్రైమ్ మెంబర్‌షిప్‌తో సైన్-అప్ చేయండి.
Amazon.in గురించి
Amazon.in మార్కెట్ ప్లేస్ అనేది Amazon.com, Inc. (NASDAQ: AMZN)కి ఒక అనుబంధంగా ఉన్న అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఆపరేట్ చేయబడుతోంది. Amazon.in అనేది విస్తారమైన సెలక్షన్, తక్కువ ధరలు, వేగవంతమైన మరియు విశ్వసనీయ డెలివరీ, మరియు ఒక నమ్మకమైన మరియు సౌకర్యవంతమైన అనుభవాన్ని వినియోగదారులకు అందించడం ద్వారా వారు ఆన్‌లైన్‌లో తాము కోరుకున్న వాటిని కొనుగోలు చేసేవిధంగా ఒక పూర్తిస్థాయి వినియోగదారు-కేంద్రీకృత ఆన్‌లైన్ గమ్యాన్ని నిర్మించడంతో పాటు అమ్మకందారులకు ఒక ప్రపంచ-శ్రేణి ఇ-కామర్స్ మార్కెట్ ప్లేస్ అందించడమే లక్ష్యంగా పని చేస్తోంది.

అమెజాన్ గురించి
పోటీదారు దృష్టికోణం కంటే వినియోగదారు ఆలోచనకి ప్రాముఖ్యం, ఆవిష్కరణ మీద మక్కువ, అత్యద్భుతంగా పనిచేయాలనే నిబద్ధత, మరియు దీర్ఘ-కాలిక ఆలోచన అనే నాలుగు సూత్రాలను అమెజాన్‌ మార్గదర్శకంగా భావిస్తోంది. కస్టమర్ రివ్యూలు, 1-క్లిక్ షాపింగ్, పర్సనలైజ్డ్ రికమండేషన్లు, ప్రైమ్, ఫుల్‌ఫిల్మెంట్ బై అమెజాన్, AWS, కిండ్లే డైరెక్ట్ పబ్లిషింగ్, కిండ్లే, ఫైర్ ట్యాబ్లెట్స్, ఫైర్ TV, అమెజాన్ ఎకో, మరియు అలెక్సా లాంటి కొన్ని ఉత్పత్తులు మరియు సర్వీసుల్లో అమెజాన్ అగ్రగామిగా ఉంటోంది. మరిన్ని వివరాల కోసం www.amazon.com/about సంప్రదించండి మరియు @AmazonNews అనుసరించండి.

*TCA గురించి:
ది టెలివిన్ క్రిటిక్స్ అసోసియేషన్ (TCA) అనేది దాదాపు 200 యునైటెడ్ స్టేట్స్ మరియు కెనడియన్ టెలివిజన్ విమర్శకులు , జర్నలిస్టులు మరియు కాలమిస్టులలతో కూడిన ఒక గ్రూప్. ఇది వార్తాపత్రికలు, మేగజైన్లు మరియు వెబ్ పబ్లికేషన్ల కోసం టెలివిజన్ కార్యక్రమాలను కవర్ చేస్తుంది. TCA ద్వారా దరఖాస్తులను ఆమోదించడంతో పాటు ఏడాదికి రెండుసార్లు – మార్చి మరియు సెప్టెంబర్‌లో సభ్యులను ఎంపిక చేస్తారు. ఎంపిక ప్రక్రియ తర్వాత, సభ్యులందరూ కాలిఫోర్నియాలోని పసాదెనాలో ఉండే ది లాంగ్‌హామ్ హంటింగ్టన్ హోటల్ మరియు స్పాలో జనవరిలో వింటర్ ప్రెస్ టూర్ కోసం సమావేశమవుతారు. అలాగే, సమ్మర్ ప్రెస్ టూర్ కోసం బేవర్లీ హిల్స్ లోని బేవర్లీ హిల్టన్‌లో సమావేశమవుతారు. వింటర్ ప్రెస్ టూర్‌లో భాగంగా నెట్ వర్క్ మిడ్ సీజన్ రీప్లేస్‌మెంట్లు, స్ట్రీమింగ్ సర్వీసెస్ కార్యక్రమాలు మరియు జనవరిలో ప్రారంభమయ్యే కేబుల్ సిరీస్‌ల గురించి చర్చిస్తారు. అలాగే, సమ్మర్ టూర్‌లో భాగంగా బ్రాడ్‌క్యాస్ట్, స్ట్రీమింగ్, మరియు కేబుల్ ప్రోగ్రామింగ్ కోసం కొత్త ఫ్యాస్ సీజన్ గురించి చర్చిస్తారు.

Related posts

భారత సినీ చరిత్రలోనే తొలిసారిగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన క్రికెట్ వీరులలో ఒకరైన ముత్తయ్య మురళీధరన్ బయోపిక్!

MOVIE WINGZ

Next அமராவதியில் அரசியலைத் தொடரும் பவன் கல்யாண்

MOVIE WINGZ