తన ప్రాంతీయ ప్రేక్షకుల కోసం 200+ ప్రముఖ డబ్డ్ షోలు మరియు చిత్రాలను తీసుకొనిచ్చిన అమెజాన్ మినీటీవి తమిళ మరియు తెలుగు భాషా కంటెంట్ లోకి ముందడుగు వేసింది !!
తన ప్రాంతీయ ప్రేక్షకుల కోసం 200+ ప్రముఖ డబ్డ్ షోలు మరియు చిత్రాలను తీసుకొనిచ్చిన అమెజాన్ మినీటీవి తమిళ మరియు తెలుగు భాషా కంటెంట్ లోకి ముందడుగు వేసింది !!
చెన్నై 20 ఏప్రిల్ 2024 ఈ ఆఫర్ ప్రేక్షకుల కొరకు హంటర్ – టోటేగా నహి తోడేగా, రక్షక్ – ఇండియాస్ బ్రేవ్స్, ఫిజిక్స్ వాలా మరియు మరెన్నో ఫ్యాన్-ప్రియమైన షోల తమిళ మరియు తెలుగు డబ్డ్ వర్షన్స్ ను తీసుకొస్తుంది!

ప్రాంతీయ డబ్డ్ షోలు అమెజాన్ మినీటీవి పై ఉచితంగా ప్రసారం అవుతాయి
ముంబై, ఏప్రిల్, 19 2024: – తన భిన్నత్వము మరియు ఒరిజినల్ మరియు డబ్డ్ కంటెట్ యొక్క గొప్ప ఎంపికలను పేరుగాంచిన అమెజాన్ యొక్క ఉచిత వీడియో ప్రసార సర్వీస్ – అమెజాన్ మినీటీవి, ఇప్పుడు తన తాజా ప్రకటనతో మరింత ఎక్కువ ప్రేక్షకులకు ఆసక్తికరమైన వార్తను అందించుటకు సిద్ధం అవుతోంది. తన వ్యాప్తిని విస్తరిస్తూ, ఈ ప్రసార సేవ తమిళ మరియు తెలుగు భాషలలోకి డబ్ చేయబడిన సుమారు 200 పైగా షోలు మరియు చిత్రాల ప్రత్యేకమైన బొకేను ప్రారంభించింది.
డబ్ చేయబడిన టైటిల్స్ యొక్క ఆసక్తికరమైన లైన్-అప్ లో మార్క్యూ మరియు హంటర్-టోటేగా నహి తోడేగా, ఫిజిక్స్ వాలా, యాక్షన్-ప్యాక్డ్ దేశభక్తి సీరీస్ రక్షక్ – ఇండియాస్ బ్రేవ్స్, ఒక యువ రొమాన్స్ సీరీస్ హైవే లవ్ వంటి మినీటీవి యొక్క ఫ్యాన్-ప్రియమైన హిందీ ఒరిజినల్స్ ఉన్నాయి. వీటికి తోడు ప్రేక్షకులు ట్విలైట్, నౌ యూ సీ మి, హంగర్ గేమ్స్ సీరీస్, ది స్టెప్ అప్ ఫ్రాంచైస్, రెడ్ మరియు మరెన్నో టైమ్లెస్ క్లాసిక్స్ తో సహా తమిళ మరియు తెలుగులోకి డబ్ చేయబడిన హాలీవుడ్ బ్లాక్బస్టర్ చిత్రాలను ఆనందించవచ్చు. సంపూర్ణ కంటెంట్ అందించే ప్రయత్నములో, ఈ సర్వీస్ వినియోగదారులకు తమిళ మరియు తెలుగు భాషలలోకి డబ్ చేయబడిన కొరియన్, టర్కిష్ మరియు మాండరిన్ షోలు కూడా అందిస్తుంది.
అమోఘ్ దుసాద్, హెడ్ ఆఫ్ కంటెంట్, అమెజాన్ మినీటీవి తన అభిప్రాయాలను ఈ విధంగా పంచుకున్నారు, “అమెజాన్ మినీటీవి వద్ద ప్రేక్షకులకు ఒక వ్యక్తిగతీకరించిన మరియు లీనమయ్యే అనుభవాన్ని అందించడం మా లక్ష్యం. మేము మా ప్రేక్షకుల భిన్నమైన ఎంపికలను నెరవేర్చడము మరియు ప్రతి ఒక్కరు తమకు ఇష్టమైన షోలు మరియు చిత్రాలను తాము కోరుకున్న భాషలో ఆనందిస్తారని నిర్ధారించడము మా ఉద్దేశము. ప్రేక్షకులు భిన్నమైన జోనర్స్ లో మా విస్తరించే ఒరిజినల్ మరియు డబ్డ్ కంటెంట్ యొక్క లైబ్రరీలో నిమగ్నం అవుతారని మేము నమ్మకంగా ఉన్నాము.”
“వినియోగదారులు మినీటీవి పై ఆనందించగలిగే భాషలలో ప్రముఖ షోలు మరియు చిత్రాలను విస్తరిస్తున్నందుకు, తద్వారా తమ ప్రసార అనుభవాన్ని మరింత పెంచుతున్నందుకు మేమెంతో సంతోషిస్తున్నాము. ఈ ప్రయత్నము ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది మరియు మా ప్రాంతీయ ప్రేక్షకుల ప్రాధాన్యతలను నెరవేర్చాలనే మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. అలాగే ఈ ముందడుగు కొత్త ప్రకటనదారులతో కలిగి పనిచేయుటకు మరియు భాగస్వామ్యాలను ఏర్పరచుకోవటానికి ఎదురుచూచుటకు మాకు అవకాశం కలిగిస్తుంది.”, అని అరుణ దర్యానాని, డైరెక్టర్ మరియు బిజినెస్ హెడ్, అమెజాన్ మినీటీవి అన్నారు.
ప్రాంతీయ భాషలలోకి డబ్ చేయబడిన షోలు అమెజాన్ యొక్క షాపింగ్ యాప్, ప్రైమ్ వీడియో, ఫైర్ టీవి, స్మార్ట్ టీవీలలో ప్రత్యేకంగా అమెజాన్ మినీటీవి పై ఉచితంగా ప్రసారం అవుతాయి లేదా ప్లే స్టోర్ నుండి యాప్ ను డౌన్లోడ్
Trailer Link: https://www.youtube.com/watch?v=8f2DQW49zgI











