అంతా ఎంతగానో ఎదురుచూస్తున్న, వరుణ్ ధావన్ – సారా అలీ ఖాన్ ల కూలీ నెం.1 ట్రైలర్ ను ఆవిష్కరించిన అమెజాన్ ప్రైమ్ వీడియో .
వరుణ్ ధావన్ – సారా అలీ ఖాన్ లతో డేవిడ్ ధావన్ రీమేక్ చేస్తున్న క్లాసిక్ 1995 కామెడీ కూలీ నెం.1 ఈ క్రిస్మస్ కు అమెజాన్ ప్రైమ్ వీడియోపై 200 దేశాలు, టెరిటరీస్ లలో పండుగ సందడిని వ్యాపింపజేయనుంది
వాసు భగ్నాని, జాకీ భగ్నాని, దీప్ శిఖ దేశ్ ముఖ్ ల నిర్మాణ సారథ్యంలో పరేశ్ రావల్, జావేద్ జాఫ్రీ, జానీ లీవర్, రాజ్ పాల్ యాదవ్, శిఖా తల్సానియా తదితరులు ఈ సినిమాలో నటించారు
ప్రపంచవ్యాప్తంగా 2020 డిసెంబర్ 25న ఇది ప్రదర్శితం కానుంది.
తాజా మరియు ప్రత్యేకమైన చలనచిత్రాలు, టీవీ కార్యక్రమాలు, స్టాండ్-అప్ కామెడీ, అమెజాన్ ఒరిజినల్స్, అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ ద్వారా ప్రకటనరహిత సంగీతం, భారతదేశపు అతిపెద్ద ఉత్పత్తుల ఎంపికపై ఉచి త ఫాస్ట్ డెలివరీ, టాప్ డీల్స్ కు ప్రారంభ ప్రాప్యత, ప్రైమ్ రీడింగ్‌తో అపరిమిత పఠనం, ప్రైమ్ గేమింగ్ తో మొ బైల్ గేమ్ కంటెంట్ తో ప్రైమ్ అద్భుతమైన విలువను అందిస్తుంది. అన్నీ నెలకు రూ.129 లకు మాత్రమే.
ముంబై, ఇండియా, నవంబర్ 28, 2020: అంతా ఎంతగానో ఎదురుచూస్తున్న కూలీ నెం.1 ట్రైలర్ ను అమె జాన్ ప్రైమ్ వీడియో నేడిక్కడ ఎక్స్ క్లూజివ్ గా విడుదల చేసింది. డేవిడ్ ధావన్ (జుద్వా, పార్ట్ నర్) దర్శక త్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ టైటిల్, గోవింద – కరిష్మా కపూర్ నటించిన 1995 నాటి ఐకానిక్ కుటుంబ వినోద చిత్రానికి రీమేక్. ఇందులో వరుణ్ ధావన్ (అక్టోబర్, స్ట్రీట్ డ్యాన్సర్ 3డి), సారా అలీ ఖాన్ (కేదార్ నా థ్, సింబా) ప్రధాన పాత్రలను పోషించారు. పరేశ్ రావల్, జావేద్ జాఫ్రీ, జానీ లీవర్, రాజ్ పాల్ యాదవ్ తదిత రులు ఇందులో నటించారు. వాసు భగ్నాని, జాకీ భగ్నాని, దీప్ శిఖ దేశ్ ముఖ్ ల నిర్మాణ సారథ్యంలో ఇది రూపుదిద్దుకుంది. క్రిస్మస్ కు పండుగ సందడి అందించేలా కూలీ నెం.1 ఎక్స్ క్లూజివ్ గా అమెజాన్ ప్రైమ్ వీడి యోపై 2020 డిసెంబర్ 25న ప్రీమియర్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు, టెరిటరీస్ లలో అందు బాటు లో ఉంటుంది.
ఈ సందర్భంగా దర్శకుడు డేవిడ్ ధావన్ మాట్లాడుతూ, ‘‘భారతీయ వినోదానికి నిజంగా ఇవి ఉద్వేగభరిత స మయాలు’’ అని అన్నారు. కష్టాన్ని మేము ప్రేమించిన తీరును యావత్ ప్రపంచం వీక్షించనుంది. అది నాకెం తో సంతోషదాయకం. సారా, వరుణ్ చక్కగా నటించారు. మా సినిమా పట్ల వీక్షకుల స్పందన కోసం నేను ఎ దురుచూస్తున్నాను’’ అని అన్నారు.
ఈ సందర్భంగా పూజా ఎంటర్ టెయిన్ మెంట్ కు చెందిన నిర్మాత వాసు భగ్నాని మాట్లాడుతూ, ‘‘మా నెం.1 ఫ్రాంచైజీ 25 ఏళ్లుగా వినోదాన్ని అందిస్తూనే ఉంది. కూలీ నెం.1 తో మేము పూజా ఎంటర్ టెయిన్ మెంట్ ప్రయాణాన్న ప్రారంభించాం. అది అద్భుత విజయం సాధించింది. వరుణ్, సారా వంటి తిరుగులేని యువతరం నటులు దాని రీమేక్ తో వస్తున్నారంటే దశాబ్దాలుగా అది వేసిన ముద్రను చూడవచ్చు. ఇంట్లో సురక్షితంగా ఉంటూనే, ఎంతో సౌఖ్యంతో కూలీ నెం.1 ను చూసి ఆనందించేందుకు వీలుగా దాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా వీక్షకులకు అందిస్తున్నందుకు మాకెంతో ఆనందంగా ఉంది’’ అని అన్నారు.
అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా డైరెక్టర్, కంటెంట్ హెడ్ విజయ్ సుబ్రమణియమ్ ఈ సందర్భంగా మాట్లా డుతూ, ‘‘డైరెక్ట్ టు సర్వీస్ ఫిల్మ్ రిలీజ్ ల పట్ల వీక్షకుల స్పందన నిజంగా ఎంతో ప్రోత్సాహదాయకంగా ఉంది. వినియోగదారులకు కావాల్సింది ఏంటో తెలుసుకొని దాన్ని అందించడానికి మేము చేస్తున్న ప్రయాణాన్ని ఇది పునరుద్ఘాటిస్తుంది’’ అని అన్నారు. ‘‘వినియోగదారులకు వారి ఇళ్లలోనే అత్యుత్తమ కంటెంట్ ను అందించేందు కు మేం నిరంతరం ప్రయత్నిస్తున్నాం. అంతా ఎంతగానో అభిమానించే నెం.1 ఫ్రాంచైజ్ నుంచి ఈ ఏడాది వస్తు న్న వాటిలో అంతా ఆత్రంగా ఎదురుచూస్తున్నది కూలీ నెం.1 గురించే. 1990 ల నాటి క్లాసిక్ కు డేవిడ్ ధావన్ చేస్తున్న రీమేక్ ఒక పరిపూర్ణ కుటుంబ వినోద చిత్రం. నవ్వులతో ఈ ఏడాదిని ముగించేందుకు సరిపోయేది. కిస్మస్ పండుగ కానుకగా దీన్ని మా కస్టమర్లకు అందించడం మాకెంతో ఆనంద దాయకం’’ అని అన్నారు.
ఈ సందర్భంగా నటుడు వరుణ్ ధావన్ మాట్లాడుతూ, ‘‘ఒరిజినల్ కూలీ నెం.1 స్క్రీన్ ప్లే, నటన లాంటి వాటిని నేనెప్పుడూ ఇష్టపడే వాడిని. అందుకే ఆ క్లాసిక్ కు అనుకరణగా సాగిన ఈ సినిమా నాకెంతో ప్రత్యేకమైంది’’ అని అన్నారు. ‘‘ఈ పాత్ర పోషించేందుకు సన్నద్ధం కావడం ఓ పెద్ద ప్రయాణంగా సాగింది. ఓ నటుడిగా హాస్యాన్ని పండించడం నాకెంతో సరదా. ఎంతో ప్రతిభావంతురాలైన సారా తో కలసి పని చేయడం ఒక అద్భుత అనుభవం. చక్కటి లొకేషన్స్ లో షూటింగ్ జరిగింది. మరిచిపోలేని అనుభూతులను అందించింది. ప్రపంచవ్యాప్తంగా కూడా వీక్షకులు ఈ క్రిస్మస్ ను ఎక్స్ క్లూజివ్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోపై కూలీ నెం.1 తో ఆనందించే అవకాశం రావడం పట్ల నేనెంతో ఆనందిస్తున్నాను’’ అని అన్నారు.
ఈ సందర్భంగా నటి సారా అలీ ఖాన్ మాట్లాడుతూ, ‘‘కూలీ నెం.1 కు పని చేస్తుంటే నా కల నిజమైన అను భూతి కలిగింది. హుస్న్ హై సుహానా, మిర్చి లగీ వంటి పాటలు వింటూనే మనం పెరిగాం. ఈ పాటల కొత్త వెర్షన్లలో నేను నటించడం ఊహకు అందని విషయం. వరుణ్ తో కలసి పని చేయడం ఓ అద్భుతం. ఆ యన ఓ చక్కటి నటుడు మాత్రమే కాదు, చుట్టూ ఉండే వారి పట్ల కేర్ తీసుకునే వ్యక్తి. పక్క వారికి సహాయం చేస్తుం టారు. స్ఫూర్తినిచ్చే స్నేహితుడిగా ఉంటారు. సెట్ లో ఎప్పుడూ వెన్నంటి ఉంటారు. డేవిడ్ సర్ తో పని చేయడం ఓ చక్కటి అవకాశం. ఈ తరహా కమర్షియల్, మసాలా, ఫ్యామిలీ కామెడీ జనర్ కు ఆయన రాజు లాంటివారు. సెట్ పై ప్రతిరోజూ ఓ పండుగే. అదే సమయంలో పరేశ్ సర్, రాజ్ పాల్ సర్, జానీ సర్, భారతి మా మ్, జావేద్ సర్ లాంటి వాళ్ళ నుంచి ఎంతో నేర్చుకునే అవకాశం కలిగింది. సాహిల్, శిఖాల నుంచి కూడా. నా కు ఈ అవకాశం అందించినందుకు గాను జాకీ, వాసు సర్ లకు ధన్యవాదాలు. తన సినిమా ద్వారా ఆయన మాకెంతో అండగా నిలిచారు. ఈ సినిమా విడుదల కోసం ఉద్వేగంగా ఎదురుచూస్తున్నాను. వీక్షకులకు సంతో షం అందిస్తామని…ఈ సినిమాతో క్రిస్మస్ కు ఉత్సాహాన్ని జోడిస్తామని అనుకుంటున్నాను’’ అని అన్నారు.
కథాంశం:
రొజారియో అనే సంపన్నవ్యాపారవేత్త నుంచి అవమానం ఎదుర్కొన్న పండిట్ జై కిషన్ ఆయనకు ఓ పాఠం నేర్పాలనుకుంటాడు. ఆయన కుమార్తె కోటీశ్వరుడిగా పోజుకొట్టే కూలీ రాజుతో జరిగేలా చేస్తాడు. త్వరలోనే రాజు సంగతి బయటపడుతుంది. తనకు సంపన్నుడైన కవల సోదరుడు ఉన్నట్లుగా ఓ కథ అల్లుతాడు రాజు. ఒక అబద్దం కప్పిపుచ్చుకునేందుకు మరో అబద్ధం చెబుతుంటాడు. చివరకు పరిస్థితి చేయి దాటుతుంది. ఇది డైరెక్టర్ డేవిడ్ ధావన్ 45వ ఎంటర్టెయినర్ ఇది. 1995లో విడుదలైన ఐకానిక్ సినిమా కు రీమేక్ ఈ కూలీ నెం.1. ఇది ఈ క్రిస్మస్ కు మీకు వినోదాన్ని, హాస్యాన్ని, రొమాన్స్ ను అందిస్తుంది. వాసు భగ్నాని, జాకీ భ గ్నాని, దీప్ శిఖ దేశ్ ముఖ్ దీన్ని నిర్మించారు.
ప్రైమ్ వీడియో కేటలాగ్ లోని వేలాది టీవీ షోలు మరియు హాలీవుడ్ మరియు బాలీవుడ్ చిత్రాల జాబి తాలోకి కూలీ నెం.1 కూడా చేరనుంది. గులాబో సితాబో, శకుంతలా దేవి, పొన్ మగల్ వందల్, ఫ్రెంచ్ బిర్యానీ, లా, సూఫియమ్ సుజాతాయమ్, వి, సి యు సూన్, సూరారై పొట్రు, భీమసేన నలమహారాజ వంటి భారతీయ సినిమాలతో పాటుగా బ్రీత్: ఇన్ టు ది షాడోస్, బాండిష్ బాండిట్స్, పాతాళ్ లోక్, ది ఫర్గాటన్ ఆర్మీ– ఆజాదీ కే లియే, ఫోర్ మోర్ షా ట్స్ ప్లీజ్, ది ఫ్యా మిలీ మ్యాన్, మేడ్ ఇన్ హెవెన్, మీర్జా పూర్, ఇన్ సైడ్ ఎడ్జ్ వంటి భారతీయ నిర్మిత అమెజాన్ ఒరిజినల్ సిరీస్ ఉన్నాయి. సబ్ సీక్వెంట్ మూవీ ఫిల్మ్, టామ్ క్లాన్సీస్ జాక్ ర యాన్, ది బాయ్స్, హంటర్స్, ఫ్లియాబ్యాగ్, ది మార్వలెస్ మిసెస్ మైసెల్ వంటి అవార్డ్ విన్నింగ్, ఎంతగానో ప్ర శంసలు పొందిన గ్లోబల్ అమెజాన్ ఒరిజినల్ సిరీస్ ను కూడా ప్రైమ్ సభ్యులు చూడవచ్చు. అమెజాన్ ప్రైమ్ స భ్యులకు ఎలాంటి అదనపు వ్యయం లేకుండానే ఇవన్నీ లభ్యమవుతాయి. హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, పంజాబీ, బెంగాలీ భాషలలో టైటిల్స్ ను కూడా ఈ సర్వీస్ లో పొందవచ్చు.
ప్రైమ్ సభ్యులు ప్రైమ్ వీడియో యాప్ ద్వారా స్మార్ట్ టీవీలు, మొబైల్ ఉపక రణాలు, ఫైర్ టీవీ, ఫైర్ టీవీ స్టిక్, ఫైర్ టాబ్లెట్స్, యాపిల్ టీవీ వంటి వాటిపై కూలీ నెం.1 ని ఎప్పుడైనా, ఎక్కడైనా చూడవచ్చు. ప్రైమ్ వీడియో యాప్ లో ప్రైమ్ సభ్యులు ఎపిసోడ్స్ ను తమ మొబైల్ ఉపకరణాల్లోకి, టాబ్లెట్స్ లోకి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఎలాంటి అదనపు వ్యయం లేకుండానే ఆఫ్ లైన్ లో ఎక్కడైనా చూసుకోవచ్చు.
భారతదేశంలో ప్రైమ్ సభ్యులకు ప్రైమ్ వీడియో సంవత్సరానికి రూ. 999 లేదా నెలకు రూ. 129 లకు లభ్య మవుతుంది. నూతన కస్టమర్లు www.amazon.in/ prime లో మరిన్ని వివరాలు పొందవచ్చు. ఉచిత 30 రోజుల ట్రయల్ కోసం సబ్ స్ర్కైబ్ చేయవచ్చు.
అమెజాన్ ప్రైమ్ వీడియో గురించి:
ప్రైమ్ వీడియో అనేది ఒక ప్రీమియం స్ట్రీమింగ్ సర్వీస్. ఇది ప్రైమ్ సభ్యులకు అవార్డ్ విన్నింగ్ అమెజాన్ ఒరిజి నల్ సిరీస్ కలెక్షన్, వేలాది సినిమాలు, టీవీ షోలు – తాము కోరుకున్నవన్నీ ఒకే చోట లభించేలా చేస్తుంది. Prime Video.com లో మరింత సమాచారం తెలుసుకోండి.
- ప్రైమ్ వీడియోతో భాగం: ప్రైమ్ వీడియో కేటలాగ్ లోని వేలాది టీవీ షోలు మరియు హాలీవుడ్ మరి యు బాలీవుడ్ చిత్రాల జాబితాలోకి కూలీ నెం.1 కూడా చేరనుంది. ఇందులో ది ఫ్యామిలీ మ్యాన్, మీర్జాపూర్, ఇన్ సైడ్ ఎడ్జ్ మరియు మేడ్ ఇన్ హెవెన్ వంటి భారతీయ నిర్మిత అమెజాన్ ఒరిజినల్ సిరీస్, టామ్ క్లాన్సీస్ జాక్ రయాన్, ది బాయ్స్, హంటర్స్, ఫ్లియాబ్యాగ్, ది మార్వలెస్ మిసెస్ మైసెల్ వంటి అవార్డ్ విన్నింగ్, ఎంతగానో ప్రశంసలు పొందిన గ్లోబల్ అమెజాన్ ఒరిజినల్ సిరీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రైమ్ వీడియోలో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఎలాంటి అదనపు వ్యయం లేకుండానే ఇవి లభ్యమవుతాయి. ఈ సేవలో హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, పంజాబీ, బెంగాలీ భాషలలో టైటిల్స్ పొందవచ్చు.
- తక్షణ యాక్సెస్: ప్రైమ్ సభ్యులు ప్రైమ్ వీడియో యాప్ ద్వారా స్మార్ట్ టీవీలు, మొబైల్ ఉపకరణాలు, ఫైర్ టీవీ, ఫైర్ టీవీ స్టిక్, ఫైర్ టాబ్లెట్స్, యాపిల్ టీవీ మరియు పలు రకాల గేమింగ్ ఉపకరణాలు వంటి వాటిపై బొంబాట్ ని ఎప్పుడైనా, ఎక్కడైనా కూలీ నెం.1 చూడవచ్చు. ఎయిర్ టెల్, వోడాఫోన్ ప్రి-పెయిడ్, పోస్ట్ పెయిడ్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్స్ ద్వారా కూడా వినియోగదారులు ప్రైమ్ వీడియోను పొందవచ్చు. ప్రైమ్ వీడియో యాప్ లో ప్రైమ్ సభ్యులు ఎపిసోడ్స్ ను తమ మొబైల్ ఉపకరణాల్లోకి, టాబ్లెట్స్ లోకి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఎలాంటి అదనపు వ్యయం లేకుండానే ఆఫ్ లైన్ లో ఎక్కడైనా చూసుకోవచ్చు.
- మెరుగుపర్చబడిన అనుభూతులు: ప్రతీ వీక్షణాన్ని మరింతగా అనుభూతి చెందండి 4కె అల్ట్రా హెచ్ డి, హై డైనమిక్ రేంజ్ (హెచ్ డిఆర్) కంపాటిబుల్ కంటెంట్ తో. ఎక్స్ క్లూజివ్ ఎక్స్ -రే యాక్సెస్ తో మీ అభిమాన సినిమాలు, టీవీ షోల గురించి మరింతగా ఆనందించండి. ఐఎండీబీచే శక్తివంతం. ఆఫ్ లైన్ లో తరువాత చూసుకునేందుకు వీలుగా సెలెక్ట్ మొబైల్ డౌన్ లోడ్స్ తో సేవ్ చేసుకోండి.
- ప్రైమ్ తో చేరిక: భారతదేశంలో ప్రైమ్ సభ్యులకు ప్రైమ్ వీడియో సంవత్సరానికి రూ. 999 లేదా నెలకు రూ. 129 లకు లభ్యమవుతుంది. నూతన కస్టమర్లు www.amazon.in/prime లో మరిన్ని వివరాలు పొందవచ్చు మరియు ఉచిత 30 రోజుల ట్రయల్ కోసం సబ్ స్ర్కైబ్ చేయవచ్చు.





