ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కామెడీ డ్రామా కుమారి శ్రీమతి ట్రైలర్ విడుదల చేసిన ప్రైమ్ వీడియో. ఇది ఒక యువతి ఆకాంక్షలు, సంప్రదాయాల కథ!!
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కామెడీ డ్రామా కుమారి శ్రీమతి ట్రైలర్ విడుదల చేసిన ప్రైమ్ వీడియో. ఇది ఒక యువతి ఆకాంక్షలు, సంప్రదాయాల కథ!!
చెన్నై 24 సెప్టెంబర్ 2023 వైజయంతి ఎంటర్టైన్మెంట్స్కు చెందిన వెబ్ విభాగం ఎర్లీ మాన్సూన్ టేల్స్ నిర్మించిన ఈ ఏడు భాగాల సిరీస్ డైరెక్టర్ గోమ్తేశ్ ఉపాధ్యే, ఇందులో నిత్యా మేనన్‌తో పాటు నిరుపమ్ పరిటాల, గౌతమి, తిరువీర్, తాళ్లూరి రామేశ్వరి, నరేశ్, మురళీమోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు
భారత్ సహ ప్రపంచంలోని 240 దేశాలు, ప్రాదేశిక ప్రాంతాల్లోని ప్రైమ్ సభ్యులు ఈ 7 ఎపిసోడ్స్‌ను సెప్టెంబర్ 28 నుంచి తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం డబ్ వెర్షన్స్ చూడవచ్చు
ముంబయి, ఇండియా—22 సెప్టెంబర్, 2023— భారతదేశం అత్యంత ఇష్టపడే వినోద గమ్యస్థానం ప్రైమ్ వీడియో చక్కిలిగింతలు పెట్టే తెలుగు కామెడీ డ్రామా కుమారి శ్రీమతి ట్రైలర్‌ను నేడు విడుదల చేసింది. గోమ్తేశ్ ఉపాధ్యే, దర్శకత్వం వహించిన ఈ సీరిస్‌లో నిత్యా మేనన్‌తో పాటు నిరుపమ్ పరిటాల, గౌతమి, తిరువీర్, తాళ్లూరి రామేశ్వరి, నరేశ్, మురళీమోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. 50 ఏళ్ల వారసత్వం కలిగిన వైజయంతి ఎంటర్టైన్మెంట్స్కు చెందిన వెబ్ విభాగం ఎర్లీ మాన్సూన్ టేల్స్ ఈ ఏడు భాగాల తెలుగు సిరీస్ నిర్మించింది. ఇది సెప్టెంబర్ 28 నుంచి ప్రైమ్ వీడియోలో ప్రత్యేకంగా ప్రసారం కానుంది. హిందీ, తమిళం, మలయాళ డబ్ కూడా అందుబాటులో ఉంటుంది. ప్రైమ్ మెంబర్‌షిప్‌లో సరికొత్త జోడింపు ఈ కుమారి శ్రీమతి. భారతదేశంలో ప్రైమ్సభ్యులు ఏటా కేవలం ₹1499తో ఏకైక మెంబర్షిప్ ద్వారా పొదుపు, సౌకర్యం, వినోదం అన్ని పొందవచ్చు.
కుమారి శ్రీమతి ట్రైలర్లో శ్రీమతి (మేనన్) అనే పేరున్న ఒక 30 ఏళ్ల ఒంటరి మహిళను, అస్తవ్యస్తంగా ఉన్న ఆమె కుటుంబాన్ని ప్రేక్షకులు చూస్తారు. తూర్పు గోదావరిలోని ఒక కుగ్రామానికి చెందిన శ్రీమతి ఒక దృఢ సంకల్పం కలిగిన మహిళ. తమ పూర్వీకుల ఇంటిని తిరిగి పొందేందుకు ఆమె గ్రామంలో ఒక బార్ అండ్ రెస్టారెంట్ తెరవాలని నిర్ణయించుకుంటుంది. ఆ మార్గంలో శ్రీమతి ప్రయాణిస్తున్నప్పుడు ఎదురయ్యే సామాజిక, నైతిక అడ్డంకులతో ఈ సిరీస్ సరదాగా సాగుతుంది.
“కుమారి శ్రీమతి నాకు ఎప్పుడు ప్రత్యేకంగా ఉంటుంది. నా జీవితంలోని ఘట్టాలను తీసుకొని రూపొందించిన ఈ సిరీస్ అంటే నాకు చాలా ఇష్టం. నేను చూసిన ప్రతీ ఒక్కరూ ఈ సిరీస్‌లో పాత్రగా కనిపిస్తారు. అందులో నాకు చాలా ఇష్టం కుమారి పాత్ర. బలహీనతలు ఉన్నప్పటికీ ఆమె ఒక పోరాట యోధురాలు. ఆత్మవిశ్వాసం, దయ, ప్రేమతో పాటు భయాలు కలిగిన స్త్రీ. దేశంలోని అత్యుత్తమ నటీమణుల్లో ఒకరు ఆ పాత్రలో నటించి ఆ వాస్తవాన్ని తెరపై చూపుతుంటే ఏ రచయితకైనా అంతకు మించిన సంతోషం ఉండదు. తెలుగు మాట్లాడే రాష్ట్రాల్లో ఇలాంటివి తెరపై చాలా కాలం తర్వాత చూస్తున్నామనుకుంటున్నాను. ప్రైమ్ వీడియో ద్వారా దీన్ని తీసుకువస్తున్నందుకు నాకు చాలా ఉత్సాహంగా ఉంది” అన్నారు స్క్రీన్‌ప్లే, మాటల రచయిత, క్రియేటర్ శ్రీనివాస్ అవసరాల.
ఈ సిరీస్ గురించి దర్శకుడు గోమ్తేశ్ ఉపాధ్యే మాట్లాడుతూ, “ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల ముందుకు కుమారి శ్రీమతిని తీసుకొస్తున్నందుకు మాకు చాలా ఉత్సాహంగా ఉంది. కామెడీ, డ్రామా, ఇందులోని పాత్రలు, సందర్భాలు కచ్చితంగా ప్రతీ ఒక్కరు ఆనందిస్తారు. సరికొత్త శైలితో కూడిన కుమారి శ్రీమతి కథ ఒక సాధారణ కుటుంబం చుట్టు తిరుగుతూ ఉంటుంది. అన్ని నేపథ్యాలకు చెందిన ప్రేక్షకులను ఇది కట్టిపడేస్తుందని మేము నమ్ముతున్నాం. ప్రైమ్ వీడియోతో కలిసి పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీని ద్వారా విభిన్న భాషలకు చెందిన ప్రేక్షకులకు చేరువ కాగలుగుతాం. వారు తమకు నచ్చిన భాషలో ఈ సిరీస్ చూడవచ్చు. ఈ సిరీస్‌ను ప్రేక్షకులందరూ చూసి సరదాగా గడపాలని మేము ఆశిస్తున్నాం” అన్నారు.
“ఆదర్శ మహిళ అనే చెప్పే మూసపద్ధతులు, సామాజిక కట్టుబాట్లను ధిక్కరించే పాత్రల్లో నటించేందుకు నేను చాలా ఇష్టపడతాను. శ్రీమతి పాత్ర గురించి విన్నప్పుడు అది ఒక తాజాదనం నిండిన గాలిగా నాకనిపించింది. స్క్రిప్ట్ చాలా సరళంగా ఉంటుంది కాని పురుషాధిక్య సమాజంలో ఒక మహిళ ప్రయాణాన్ని చాలా ప్రభావవంతంగా చూపుతుంది. నటిగా కొత్త విషయాలు తెలుసుకునేందుకు, లోతైన దృక్పథాన్ని చూసేందుకు నాకు ఇది అవకాశం కల్పించింది. స్ట్రీమింగ్ సర్వీసుగా ప్రైమ్ వీడియో అంతర్జాతీయ ఔచిత్యం ఉన్న స్థానిక కథలు, కళాకారులను ఆదరిస్తోంది. బ్రీథ్:ఇంటూ షాడోస్, మోడ్రన్ లవ్ హైదరాబాద్ వంటి టైటిల్స్‌తో ఈ బ్రాండ్‌తో అనుబంధం కలిగిన నేను ఇప్పుడు మరో అసాధారణ కథతో మళ్లీ వస్తుండటం చాలా సంతోషంగా ఉంది. పితృస్వామ్య వ్యవస్థతో పోరాటం చేస్తున్న అనేక మంది మహిళలు ఈ కథతో కనెక్ట్ అవుతారని నేను నమ్ముతున్నాను” అన్నారు ప్రధాన పాత్రధాని నిత్యా మేనన్.
“మూస ఆలోచనలను పక్కన పెట్టి కలలు సాకారం చేసుకునే నేటి మహిళకు ప్రతిబింబంగా నిలుస్తుంది కుమారి శ్రీమతి. దాదాపు మూడేళ్లగా శ్రీమతితో నా ప్రయాణం సాగుతోంది. ఇది నన్ను ఎంతో కట్టిపడేసింది” అన్నారు నిర్మాత స్వప్న దత్.











