సెప్టెంబర్ 9న ఉద్వేగభరితమైన రొమాన్స్ డ్రామా సీతా రామం ప్రత్యేక స్ట్రీమింగ్ ప్రీమియర్ ప్రకటించిన ప్రైమ్ వీడియో!!

చెన్నై 06 సెప్టెంబర్ 2022 సెప్టెంబర్ 9న ఉద్వేగభరితమైన రొమాన్స్ డ్రామా సీతా రామం ప్రత్యేక స్ట్రీమింగ్ ప్రీమియర్ ప్రకటించిన ప్రైమ్ వీడియో!!

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘సీత రామం’ సినిమాకి హను రాఘవపూడి దర్శకత్వం వహించగా, వైజయంతి మూవీస్, స్వప్న సినిమా సంయుక్తంగా నిర్మించాయి.

భారతదేశంలోని ప్రైమ్ చందాదారులు 240 దేశాలు, భూభాగాల్లోని ప్రైమ్ చందాదారులు ప్రేమకథను తెలుగు, మలయాళం, తమిళంలలో 2022 సెప్టెంబర్ 9 నుండి ప్రత్యేకంగా ప్రైమ్ వీడియోలో వీక్షించవచ్చు.

తాజా, ప్రత్యేకమైన సినిమాలు, టివి షోలు, స్టాండ్అప్ కామెడీలు, అమెజాన్ ఒరిజినల్స్, అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ ద్వారా ప్రకటనలు లేని సంగీతంతో ప్రైమ్ తన వినియోగదారులకు అద్భుతమైన విలువను అందిస్తోంది, అంతేకాదు భారతదేశ అతిపెద్ద ఎంపిక చేసిన ఉత్పత్తులపై ఉచిత వేగవంతమైన డెలివరీ, టాప్ డీల్స్కు ముందస్తు అవకాశం, ప్రైమ్ రీడింగ్తో అపరిమిత రీడింగ్, ప్రైమ్ గేమింగ్తో మొబైల్ గేమింగ్ కంటెంట్ అపరిమిత స్ట్రీమింగ్ కూడాఇవన్నీ రూ. 1499 వార్షిక సభ్యత్వంతో లభ్యం అవుతాయి. ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్కు సబ్ స్క్రైబ్ చేసుకోవడం ద్వారా కూడా కస్టమర్లు సీతా రామంను చూడవచ్చు. ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ అనేది ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ప్రస్తుతం లభ్యం అవుతున్న ఏక వినయోగదారు, మొబైల్కు మాత్రమే వర్తించే ప్లాన్.

ఇండియా, 6 సెప్టెంబర్, 2022 –  తెలుగు బ్లాక్ బస్టర్ సీతా రామం ప్రపంచవ్యాప్త డిజిటల్ ప్రీమియర్‌ను ప్రైమ్ వీడియో ఈ రోజు ప్రకటించింది. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ ప్రేమ కావ్య డ్రామాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించగా, దుల్కర్ సల్మాన్, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్  ప్రధాన పాత్రల్లో నటించారు.  మనోహరమైన నటన, మంత్రముగ్దులను చేసే సంగీతంతో నిండిన సీతా రామం, సీత నుండి ఒక లేఖ అందుకున్న తరువాత తన జీవితమే మారిపోయిన ఓ అనాథ సైనికుడు లెఫ్టినెంట్ రామ్ మర్మమైన ప్రేమ కథను కళ్లకు కడుతుంది. దృశ్యమానంగా అందమైన ఈ కథను భారతదేశంలోని ప్రైమ్ చందాదారులు, 240 దేశాలు, భూభాగాలలో 2022 సెప్టెంబర్ 9 నుండి తెలుగుతో పాటు మలయాళం మరియు తమిళ భాషల డబ్‌లను ఆస్వాదించవచ్చు.

సీతా రామం అనేది ఇద్దరి మధ్య పుట్టే స్వచ్ఛమైన ప్రేమ మనోహరతను చూపే కాలాతీతమైన, హృదయాన్ని ఉత్తేజపరిచే చిత్రంఅని దుల్కర్ సల్మాన్ అన్నారు. “మా చిత్రానికి వస్తున్న స్పందనతో నేను ఆనందంలో మునిగిపోతున్నాను. ప్రపంచవ్యాప్తంగా ప్రైమ్ వీడియో ద్వారా ప్రేక్షకులు కథ ఉత్తేజాన్నిఅనుభూతి చెందే అవకాశం పొందండం సంతోషకరం. ఇది నిజంగా ఒక ప్రత్యేకమైన చిత్రం, నా హృదయంలో ఎల్లప్పుడూ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుందిఅని అన్నారు.

సీతగా నటించడం నా జీవితంలో అత్యంత వినయపూర్వకమైన అనుభవాలలో ఒకటిఅని మృణాల్ ఠాకూర్ తన తొలి తెలుగు చిత్రం గురించి చెప్పారు. “కథనం విన్న కొద్ది నిమిషాల్లోనే నేను మంత్రముగ్దురాలినయ్యాను, అవకాశాన్ని వదులుకోలేకపోయాను. ఇది దక్షిణాదిలో నా మొదటి చిత్రం, ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ ప్రీమియర్తో, చిత్రాన్ని ఎక్కువ మంది ప్రేక్షకులు చూసే వరకు వేచి ఉండలేకపోయాను, ఇది విడుదలైనప్పటి నుండి నేను అనుభవించిన అదే ప్రేమను ఇస్తుంది.” అని అన్నారు.

రష్మిక మందన్న మాట్లాడుతూమా సినిమా సీతా రామం ప్రయాణం ఆసక్తికరంగా, అద్భుతమైన ప్రయాణంగా సాగింది. “మొత్తం టీమ్కు, ముఖ్యంగా హను సర్కు అభినందనలు మరియు అఫ్రీన్కు ధన్యవాదాలు. చిత్రానికి చాలా మంచి స్పందన వచ్చింది. ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్ట్రీమింగ్ ప్రీమియర్తో ఇది ప్రేమ, విజయాల కొత్త ఎత్తులకు చేరుకుంటుందని నేను ఆశిస్తున్నానుఅని అన్నారు.

error: Content is protected !!