తమిళ్ ఒరిజినల్ సిరీస్ సుళల్ – ది వోర్టెక్స్  ప్రతిభావంతమైన ట్రెయిల్ విడుదల చేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో!

చెన్నై 08 జూన్ 2022 తమిళ్ ఒరిజినల్ సిరీస్ సుళల్ – ది వోర్టెక్స్  ప్రతిభావంతమైన ట్రెయిల్ విడుదల చేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో!

పుష్కర్, గాయత్రి రచించి, సృష్టించిన సుళల్ – ది వోర్టెక్స్ లో కథిర్, ఐశ్వర్య రాజేష్, శ్రియ రెడ్డితోపాటు రాథాకృష్ణన్ పార్తిబన్ నటించేరు. ఈ సిరీస్, జూన్ 17 నుంచి భారతదేశంలోను, 240 ఇతర దేశాల్లోనూ స్ట్రీమ్ అవుతుంది.

వాల్ వాచర్ ఫిలిమ్స్ నిర్మించి, బ్రమ్మ, అనుచరణ్.ఎం దర్శకత్వం వహించిన సుళల్ది వోర్టెక్స్ ప్రైమ్ వీడియోస్ వారి తొలి తమిళ ఓరిజినల్ సిరీస్, ఇది హిందీ, కన్నడ, మలయాళ, తెలుగు, ఇంగ్లీషు భాషలతోపాటు విదేశీ భాషలైన ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, జపనీస్, పోలిష్, పోర్చుగీస్, కాస్టిలియన్ స్పానిష్, లాటిన్ స్పానిష్, అరబిక్, టర్కిష్ భాషల్లోకూడా అందుబాటులో వుంటుంది. ఈ సిరీస్, అదనంగా ఇతర విదేశీ భాషల్లో సబ్-టైటిల్స్ తో అందుబాటులో వుంటుంది.

అమెజాన్ ఇటీవలి, ప్రత్యేక మూవీలు, టీవీ షోలు, స్టాండప్ కామెడీలు, అమెజాన్ ఒరిజనల్స్ అపరిమిత స్ట్రీమింగ్ని అందిస్తోంది. అలాగే అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ ద్వారా యాడ్-ఫ్రీ మ్యూజిక్, భారతదేశ అతిపెద్ద ఉత్పత్తుల ఎంపిక నుంచి ఉచిత, వేగవంత డెలివరీని, టాప్ డీల్స్ కి త్వరగా యాక్సెస్ ని, ప్రైమ్ రీడింగ్ తో అపరిమితంగా చదువుకోడాన్ని, ప్రైమ్ గేమింగ్ ద్వారా మొబైల్ గేమింగ్ కంటెంట్ని అందుబాటులోకి తెస్తోంది, ఇవన్నీకూడా      రూ. 1499ల వార్షిక సభ్యత్వంతో అందుబాటులోకి వస్తాయి. ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ని సబ్ స్క్రైబ్ చేయడం ద్వారా వినియోగదారులు సుళల్ ని చూడొచ్చు. ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ అనేది సింగిల్  యూజర్, మొబైల్ ఓన్లీ ప్లాన్, ప్రస్తుతం ఇది ఎయిర్ టెల్ ప్రీపేయిడ్ ఖాతాదారులకి మాత్రమే అందుబాటులో వుంటోంది.. ‬‬‬చెన్నై, జూన్ 7, 2022: ఊపిరి బిగబట్టేంత మిస్టరీలోకి తొంగిచూసే అవకాశంగా, ప్రైమ్ వీడియో ఈరోజు, సుదీర్ఘరూపంలో స్క్రిప్టింగ్ చేసిన తన తొలి తమిళ సిరీస్, థ్రిల్లర్ అయిన సుళల్-వోర్టెక్స్ ట్రెయిలర్ ని విడుదల చేసింది. డైనమిక్ జోడీ అయిన పుష్కర్, గాయత్రిలు రాసి, సృష్టించగా, బ్రమ్మ, అనుచరణ్.ఎంలు దర్శకత్వం వహించిన ఈ 8 ఎపిసోడ్ల పరిశోధనాత్మక డ్రామా, బడికెళుతున్న ఒక ఆడపిల్ల మాయమైపోవడంతో ఒక చిన్న పారిశ్రామిక పట్టణంలో వరసపెట్టి జరిగిన సంఘటనల సమాహారంగా, ఉత్కంఠభరిత ప్రయాణంగా, మార్మికంగా సాగుతుంది.  రాధాకృష్ణ పార్తిబన్తో పాటు కార్తీక్, ఐశ్వర్య రాజేష్, శ్రియా రెడ్డి వంటి ప్రతిభావంతమైన నటులు ఇందులో నటించేరు. తమిళ ఒరిజనల్ సిరీస్ అయిన సుళల్ – ది వోర్టెక్స్, హిందీ, కన్నడమలయాళం, తెలుగు, ఇఁగ్లీషులతోపాటు పలు భారతీయ భాషల్లోను, అలాగే ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, జపనీస్పోలిష్, పోర్చుగీస్, కాస్టిలియన్ స్పానిష్, లాటిన్ స్పానిష్, అరబిక్, టర్కిష్ వంటి విదేశీ భాషల్లోనూకూడా అందుబాటులో వుంటుంది. అలాగే చైనీస్, చెక్, డానిష్, డచ్ఫిలిపినో, ఫిన్నిష్, గ్రీక్హీబ్రూ, హంగేరియన్, ఇండోనేసియన్, కొరియన్, మలయ, నార్వేజియన్ బోకమ్, రొమేనియన్, రష్యన్స్వీడిష్, థాయ్, ఉక్రేనియన్, వియత్నామీస్ వంటి ఎన్నో విదేశీ భాషల్లో సబ్టైటిల్స్ తోకూడా అందుబాటులో వుంటుంది. భారతదేశంలోను, ప్రపంచవ్యాప్తంగా 240 దేశాలు, ప్రాంతాల్లో ప్రైమ్ సభ్యులు 2022 జూన్ 17 మొదలుకుని సుళల్ – ది ఓర్టెక్స్ చూడగలుగుతారు.‬‬

సుళల్ది వోర్టెక్స్, తమిళనాడులోని చిన్న టౌనులో బడికెళ్ళే చిన్న ఆడపిల్ల కనిపించకుండాపోవడంతో మొదలవుతుంది. కనిపించకుండాపోయిన వ్యక్తిగురించి పరిశోధించే డ్రామాగా ప్రారంభమైనదికాస్తా, కథలో, కథనంలో ఎన్నో మలుపులు తిరుగుతూ, ప్రతి మలుపులోనూ కొత్త నిజాలు బయటపెడుతూ, ఆ చిన్న టౌనుని, దాని సామాజిక  అల్లికని ఛిన్నాభిన్నంచేసేలా గుండెలు  దడదడాకొట్టుకునేంత థ్రిల్లర్ గా మారుతుంది. ఏటా జరిగే సాంస్కృతిక ఉత్సవం నేపథ్యంలో ప్రారంభమయ్యే ఈ సిరీస్, నైపుణ్యమైన అబద్ధాలు, వంచన, లోపల వేరే అజెండాతో వుండే అనుమానిత పాత్రలు, భావావేశాల ఎగుడుదిగుళ్ళ ప్రయాణం, వీక్షకుల్ని ఉత్కంఠభరితంగా వుంచుంతుంది. వడివడిగా సాగే స్క్రీన్ ప్లే, అత్యద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో సాగే ఈ సిరీస్ మిస్టరీల పుట్టలాగా వుండి వీక్షకులు ఇందులో లీనమైపోయేలా, మరింత ఎదురుచూసేలా చేస్తుంది. 

ఈ సిరీస్ లో తొలి నాలుగు ఎపిసోడ్లకి దర్శకత్వం వహించిన బ్రమ్మ మాట్లాడుతూ, మేం పడిన శ్రమ చివరకి ప్రేక్షకుల ముందుకు రావడం అనేది ఎంతో ఆనందంగా వుంది. వీటిల్లో కొన్ని అద్భుతమైన నటనా ప్రదర్శనలు, మంచి పట్టుగా సాగే కథనాలు ప్రతి ఎపిసోడ్ లోనూ ప్రేక్షకులు ఊహిస్తూ వుండేలా చేస్తుంది. సుళల్ – ది వోర్టెక్స్ భిన్నమైన రీతిలో ఒక కథ చెప్పడం, వివిధ స్థాయిల్లో అది ప్రేక్షకులకి నచ్చుతుంది. ఒక చీకటి రహస్యం కేంద్రంగా సాగేటప్పటికీ, వరసగా ఆ క్రమంలో ఎదురయ్యే, ఎగుడుదిగుడుగాసాగే పరిస్థితులు, నమ్మకాలు, రహస్యాలు కలగలిసి, ఇందులో పాత్రలు, తద్వారా వీక్షకులు ఏది నిజం, ఏది అవాస్తవం అనే వాటి మధ్య మారుతూంటారు. పుష్కర్, గాయత్రిలతో కలిసి పనిచేసినందుకు, వారు అందించదల్చుకున్న అద్భుతమైన వీక్షక అనుభవం కోసం కృషిచేయడంలో భాగమైనందుకు నాకు ఆనందంగా వుంది. ఇప్పటివరకూ వారు ఎన్నో మంచి విజయాలని చూసేరు, సుళల్ – ది వోర్టెక్స్ తో కూడా మళ్ళీ అదే జరగాలని ఆశిస్తున్నాను. ప్రైమ్ వీడియోలో దీని గ్లోబల్ ప్రీమియర్ కోసం, ప్రపంచవ్యాప్తంగా 240 దేశాలు, ప్రాంతాల నుంచి, ప్రతిస్పందనలు అందుకోడం కోసం ఎదురుచూస్తున్నాం అన్నారు.

సిరీస్ లో 5-8 ఎపిసోడ్లకి దర్శకత్వం వహించిన అనుచరణ్.ఎం, ఈ సందర్భంగా మాట్లాడుతూసుళల్ – ది ఓర్టెక్స్ కోసం నన్ను సంప్రదించినప్పుడు, దాని సంక్లిష్టత, కథనం తీరులకి నేను ముగ్ధుడ్ని అయిపోయేను. దీంట్లో వరస సంఘటనలు అల్లిన తీరు, ప్రేక్షకులు వారి స్క్రీన్లకి అతుక్కుపోయేలా, ప్రతి సందర్భంలోనూ వారు మార్మికతని ఎదుర్కొనేలా చేస్తుంది. ఈ మంచి థ్రిల్లర్ కి నా మీద నమ్మకం వుంచినందుకు పుష్కర్, గాయత్రిలకు నేను కృజ్ఞుడిని. ఈ కథకి ప్రాణంపోసి, థ్రిల్లర్లలోకూడా విడిగా నిలబడేలా చేయడంలో యావత్ బృందం చేసిన సహాయం, కృషి ప్రత్యేకమైనది. సుళల్ – ది వోర్టెక్స్ ప్రైమ్ వీడియోలో పలు భారతీయ భాషల్లోను, విదేశీ భాషల్లోనూ ప్రదర్శితమవడం ఆనందంగా వుంది. దీనిద్వారా, ఈ కథని విశాలమైన వేదికపై బ్రహ్మాండమైనస్థాయిలో వీక్షకుల దగ్గరకి తీసుకెళ్ళడానికి, వాళ్ళని దీంతో అలరించడానికి అవకాశం కలుగుతోంది అన్నారు. 

ఈ సిరీస్ లో సబ్-ఇన్స్పెక్టర్ పాత్ర పోషించిన కథిర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ,  “సుళల్ – ది ఓర్టెక్స్ ద్వారా మీ ముందుకొస్తున్న అద్భుతమైన కథలో భాగం కావడం ఆనందంగా వుంది. ఇది మిమ్మల్ని సీరిస్ అంతా ఎంటర్టెయిన్ చేస్తూ, ఉత్కంఠభరితంగా సాగుతుంది. చిక్కటి, చీటకి మిస్టరీ కేంద్రంగా సాగేటప్పటికీ, ఈ సిరీస్ ప్రతిసారీ మంచి మలుపులు, ట్విస్ట్ లతో బిగుతైన కథనంతో, ప్రేక్షకుల్ని కళ్ళు తిప్పుకోనివ్వదు. ఈ అసలైన, అద్భుతమైన కథని మీ ముందుకు తీసుకురావడానికి ఒక బృందంగా మేమంతా కృషిచేసేం. సుళల్ – ది ఓర్టెక్స్, ప్రైమ్ వీడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా 240 దేశాలు, ప్రదేశాల్లో విడుదలయ్యే గ్లోబల్ ప్రీమియర్ కోసం ఎదురు చూస్తున్నాను” అన్నారు.

డిజిటల్ లో తొలిసారి నటిస్తున్న ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ, ఒక నటిగా, మనం నటించాలనుకునే కథలు, వాటిలో భాగం కావాలనుకునే ప్రాజెక్టులూ వుంటాయి. సుళల్ – ది ఓర్టెక్స్ నాకు అలాటి ఒక గొప్ప అనుభవం. ఇంతటి ప్రతిభవున్న జట్టుతో కలిసి పనిచేయడం నిజంగా నాకు గొప్ప అనుభూతి మిగిల్చింది. ఈ సిరీస్ ఒక చిన్న టౌను కేసు గురించే అయినప్పటికీ, ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకి అపీల్ చేస్తుంది, వాళ్ళని స్క్రీన్స్ మీంచి కళ్ళు తిప్పనివ్వదు. ఇదొక గొప్ప ఉత్సాహభరిత ప్రయాణం, విభిన్నంగా, విశ్వాసనీయంగా, అచ్చంగా వుండే ఈ కథలో నటించినందుకు నాకు ఆనందంగా వుంది. సుళల్ – ది ఓర్టెక్స్ ఎప్పుడూ నాకు ప్రత్యేకమైనదే అవుతుంది, అంటే, ఇది గొప్ప షో అనిమాత్రమేకాకుండా, డిజిటల్ సిరీస్ లో తొలిసారిగా నటిస్తున్నందుకు కూడా ఇది నాకు చాలా ప్రత్యేకమైనది!” అన్నారు.

ఇన్స్పెక్టర్ రెగినా పాత్ర పోషించిన శ్రియారెడ్డి సుళల్ ది వోర్టెక్స్ ఒక భావావేశాలు, థ్రిల్, మిస్టరీల సుడిగుండం. ఈ భావాలన్నీ ముప్పిరిగొని వీక్షకులని తప్పకుండా ఆశ్చర్యపోయేలా అలరిస్తాయి. సుళల్  సరికొత్త తాజా భావన కలిగించే ప్రత్యేక కథ, కథనం, థ్రిల్లర్ విభాగంలో ఇది చాలా విభిన్నంగా నిలుస్తుంది. ఈ కథని సృష్టించి, అందులో ఈ పాత్రకి నా మీద నమ్మకం వుంచి, ఇంత అద్భుతమైన సిరీస్ లో నాకు అవకాశం ఇచ్చినందుకు దీని క్రియేటర్స్ కి, డైరెక్టర్స్ కి ధన్యవాదాలు. వీక్షకులు దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఒకటి మాత్రం నేను హామీ ఇస్తున్నాను – ఈ సిరీస్ చివరి వరకూ అందరూ ఊహించుకునేలా చేస్తుంది. అంచేత నిజంగా ఉత్కంఠభరితమైన కథ, కథనాలు చూడ్డానికి సిద్ధంకండి!” అన్నారు. ‬

ఈ సిరీస్ లో చాలా కీలకమైన పాత్రపోషించిన రాధాక్రిష్ణన్ పార్తిబన్, ఈ సందర్భంగా మాట్లాడుతూ,“చాలాకాలంగా మేం ఈ కథనే శ్వాసిస్తూ, దీంతోనే బతుకుతూ తయారు చేసేం, చివరకి ప్రేక్షకులకి చిరకాలం గుర్తుండిపోయే అనుభవాన్ని అందించడానికి ఇదిప్పుడు సిద్ధమవడం గొప్పగా వుంది. పుష్కర్, గాయత్రి లు డైరెక్టర్లు బ్రమ్మ, అనుచరణ్.ఎంలతో కలిసి, ప్రేక్షకుల మనసుల్లో చిరకాలం గుర్తుండిపోయేలా అద్భుతమైన కృషి చేసేరు. పరిశ్రమలో 40 ఏళ్ళు గడిపేక, ఇలాటి ఒక సిరీస్ తో, అపూర్వమైన సహ నటులు, మంచి క్రియేటర్స్ తో డిజిటల్ రంగంలో ప్రవేశిస్తున్నందుకు ఆనందంగా వుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో పై బహుళ భాషల్లో ఇది గ్లోబల్ ప్రీమియర్ గా ప్రసారం అవడం కోసం ఎదురుచూస్తున్నాను. దీనికి ప్రపంచవ్యాప్త స్వభావం కలిగిన కథ వున్నందున, ఇది అన్ని సంస్కృతులు, ప్రాంతాలవరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాను!” అన్నారు.

XXX

సుళల్ ది వోర్టెక్స్ ఇప్పుడు ప్రైమ్ వీడియో కేటలాగ్ లో వున్న వేలాదీ టీవీ షోలు, హాలీవుడ్, బాలీవుడ్ సినిమల్లో చేరుతుంది. వీటిల్లో, భారతదేశంలో నిర్మించిన అమెజాన్ ఒరిజనల్ సిరీస్ అయిన మాడర్న్ లవ్ ముంబై, ముంబై డైరీస్, ది ఫామిలీ మ్యాన్, కామిక్ స్టాన్ సెమ్మా కామిడీ పా, బ్రీత్: ఇంటూ ది షాడోస్, బాండిష్ బాండిట్స్, పాతాల్ లోక్, తాండవ్, మిర్జాపూర్ సీజన్ 1 & 2, ది ఫర్గాటెన్ ఆర్మీ – ఆజాదీ కె లియే, సన్స్ ఆఫ్ సాయిల్: జైపూర్ పింక్ పాంథర్స్, ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్, మేడ్ ఇన్ హెవెన్, ఇన్సైడ్ ఎడ్జ్, అలాగే మిగతావాటితోపాటు భారతీయ సినిమాలైన కూలీ నెం.1, గులాబొ సితాబ్, దుర్గమటి, ఛాలాంగ్, శకుంతలా దేవీ, పొన్మగల్ వందాళ్, ఫ్రెంచ్ బిర్యానీ, లా, సుఫియం సుజతయుం, పెంగ్విన్, నిశ్శబ్ధం, మారా, వి, సియు సూన్, సూరారై పోట్రు, భీమ సేన నల మహారాజ, దృశ్యం 2, హలాల్ లవ్ స్టోరీ, మిడిల్ క్లాస్ మెలోడీస్, పుత్తం పుదు కాలై, అన్పాజ్డ్, అవార్డులు గెలుచుకున్న, గొప్ప మన్ననలు పొందిన గ్లోబల్ అమెజాన్ ఒరిజినల్స్ అయిన బొరాత్ సబ్సీక్వెంట్ మూవీ ఫిల్మ్, టామ్ క్లాన్సీ  తాలూకు జాగ్ రయాన్, ది బాయస్, హంటర్స్, ఫ్లీబ్యాగ్, ది మార్వెలస్ మిసెస్ మైసెల్ కూడా వున్నాయి. అమెజాన్ ప్రైమ్ సభ్యులకి ఇవన్నీ అదనపు ఖర్చు లేకుండానే అందుబాటులో వుంటాయి. ఈ సర్వీసులో, హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళ్, తెలుగు, కన్నడ, మళయాళం, పంజాబీ, బెంగాలీ సినిమాలుకూడా వుంటాయి.‬‬

ప్రైమ్ సభ్యులు ఈ సిరీస్లని ఎక్కడ నుంచైనా ఎప్పుడైనా ప్రైమ్ వీడియో ఆప్ పైన, స్మార్ట్ టివిలు, మొబైల్ డివైజ్ లు, ఫైట్ టీవీ, ఫైర్ టీవీ స్టిక్, ఫైట్ టాబ్లెట్స్, ఆపెల్ టివి వంటివాటిపై చూడొచ్చు. ప్రైమ్ వీడియో ఆప్ లో, ప్రైమ్ సభ్యులు వారికి కావాల్సిన ఎపిసోడ్లని వారి మొబైల్ సాధనాల్లోకి, టాబ్లెట్లోకి డౌన్లోడ్ చేసుకుని ఎక్కడైనా, అదనపు ఖర్చులేకుండా ఆఫ్ లైన్లో వాటిని చూడొచ్చు. ప్రైమ్ సభ్యత్వం ఏటా రూ.1499లకి లేదా నెలవారీగా రూ. 179లకి తీసుకున్నట్టయితే, ప్రైమ్ వీడియో భారతదేశంలో అదనంగా ఎటువంటి రుసుమూ లేకుండా అందుబాటులో వుంటుంది. కొత్త ఖాతాదారులు www.amazon.in/prime లో మరింత సమాచారం పొంది, 30 రోజుల ఉచిత ట్రయల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.

error: Content is protected !!